Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్ సీసీటీవీ కెమెరాలు ప్రతి కాలనీలో అవసరమే..

 సీసీటీవీ కెమెరాలు ప్రతి కాలనీలో అవసరమే..

- Advertisement -

ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, ఐపీఎస్..
నవతెలంగాణ – కామారెడ్డి
: ప్రతి కాలనీలో సీసీ టీవీ కెమెరాలో అవసరమేనని కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణం లోని ఇందిరానగర్ డబల్ బెడ్ రూమ్ ల సముదాయంలో ఏర్పాటు చేసిన 30 సీసీటీవీ కెమెరాలను సోమవారం  ఏఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రజలను అభినందిస్తున్నానన్నారు. ఈ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం నిజముగా అద్భుతం గా ఉందనీ, కేవలం దిగువ, మధ్య తరగతి కి చెందిన ప్రజలు ముందుకు వచ్చి, తలా కొంత డబ్బు జమ చేసుకుని, మొత్తం అందాజ 2లక్షల రూపాయలతో సోమవారం సీసీటీవీ కెమెరాలు ఏర్పరచుకుని, మాతో ప్రారంభింప చేసి, పోలీస్ లకు సహకరించినందుకు,  ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నాను అన్నారు. సీసీటీవీ కెమెరాలు  అనేవి నేర పరిశోధనలో, నేరాలను అరికట్టడం లో, నేరస్థులను పట్టుకోవడం లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అంతేగాక ఒక్క కెమెరా 100 మంది పోలీస్ లతో సమానం అని పేర్కొన్నారు. గొప్ప పని చేసిన కాలనీ వాసులను ఈ సందర్భంగా అభినందిస్తున్నానన్నారు. ఆర్థికంగా పేదరికం లో ఉన్న కూడా, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కు సహకరించడం గొప్ప మానవతా దృక్పథం అని కొనియాడడం జరిగింది. ఈ విధముగా మిగతా కాలనీ లలో నివసించే ప్రజలు కూడా స్వచందముగా ముందుకు వచ్చి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్సై. శ్రీరామ్, సిబ్బంది కమలాకర్ రెడ్డి, విశ్వనాథ్, అజర్, సంపత్, నర్సారెడ్డి, కాలనీ వాసులు రాజు, ముజాహెద్, షాదుల్, మహిళలు, ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -