Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ రిజర్వేషన్ల కోసం సీపీఐ(ఎం) ఆందోళన..

బీసీ రిజర్వేషన్ల కోసం సీపీఐ(ఎం) ఆందోళన..

- Advertisement -

నవతెలంగాణ – రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కొరకు చట్టం చేయడంలో బిజెపి దొంగ వైఖరి అనుసరిస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల్ల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. సీపీఐ(ఎం) ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం రాజ్ భవన్ ముట్టడి కోసం తరలి వెళుతున్న పార్టీ నాయకులను, కార్యకర్తలను స్థానిక పోలీసులు వేకువ జాముననే వారి ఇంటికి వెళ్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానీదేనని, పార్లమెంట్లో చట్టం చేయాలని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఆ బాధ్యతను విస్మరించి బిజెపి ప్రజలను మోసం చేస్తుందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయిని ఆనంద్, బల్గూరి అంజయ్య, కందుల హనుమంతు, మునికుంట్ల లెవెన్, గొరిగే సోములు, సత్యం, నరసింహ, గాదె నరేందర్, మల్లేశం, వెంకటేశ్వర్లు, గణేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -