– ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుని చిత్రపటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
నిజామాబాద్ జిల్లాకు నూతనంగా వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తూ తెలంగాణ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద ఆ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ తెలంగాణ క్యాబినెట్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల కమ్మర్పల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారం ఇంతకుముందు జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో వ్యవసాయ కళాశాల మంజూరు చేసి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు కావడం జిల్లా ప్రజల అదృష్టంగా పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ముందు ముందు పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. పేద ప్రజల కోరికలు, వారికి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసి తీరుతుందని పేర్కొన్నారు.
జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన తెలంగాణ క్యాబినెట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, ఉప్లూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, నాయకులు దూలూరి కిషన్ గౌడ్, పూజారి శేఖర్, నాగాపూర్ అశోక్, సింగిరెడ్డి శేఖర్, నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, వేములవాడ జగదీష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు పట్ల హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES