- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ దుకాణాలను శుక్రవారం తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని జీసీసి గోదాంలో ఉన్న రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి, లబ్ధిదారులకు బియ్యం పంపిణీ, స్టాక్ రికార్డులను పరిశీలించారు. ప్రతి లబ్ధిదారునికి బియ్యాన్ని అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిసి చౌదరి, కస్తూరి ప్రభాకర్, గోదాం సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -