Sunday, October 19, 2025
E-PAPER
Homeజిల్లాలుఫామ్ హౌస్లపై పోలీసు నిఘా: మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి

ఫామ్ హౌస్లపై పోలీసు నిఘా: మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి

- Advertisement -

అసాంఘిక కార్యక్రమాలకు తావులేదు
తల నొప్పులు తెచ్చుకోవద్దు
ముద్ర, రేవ్ పార్టీలకు అనుమతించం
ఆదాయ వనరులను దెబ్బ తీసుకోవద్దు
రిసార్ట్, ఫామ్ హౌస్ యాజమానుల అవగాహన సదస్సు
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
ఫామ్ హౌస్లపై పోలీసు నిఘా ఉంటుందని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. వాటిలో అసాంఘిక కార్యక్రమాల నిర్వహణకు తావులేదన్నారు. వీటిని అతిక్రమించి తల నొప్పులు తెచ్చుకోవద్దని సూచించారు. ముద్ర, రేవ్ పార్టీలకు అనుమతించబోమన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు అధ్యక్షతన రిసార్ట్, ఫామ్ హౌస్ యాజమానుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం డీసీపీ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తే నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసార్ట్, ఫామ్ హౌస్ ల పూర్తి వివరాలు సేకరించడం జరిగిందన్నారు.

ఫామ్ హౌస్, రిసార్ట్ ల వివరాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ సైట్ లో పొందుపరచడం జరుగుతుందన్నారు. నగర శివారుల్లో రిసార్ట్, ఫామ్ హౌస్ లలో అత్యధికంగా ముద్ర, రేవ్ పార్టీలు జరుగుతున్నవున్నారు. అలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నివారించేందుకు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. ఫామ్ హౌస్, రిసార్ట్ లపై త్వరలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక సైటును ఏర్పాటు చేస్తున్నామన్నారు. రిసార్ట్, ఫామ్ హౌస్ లలో నిర్వహించే దావత్ లకు సంబంధించే ముందు అనుమతులు తీసుకున్న తర్వాతనే అద్దెకు ఇచ్చే విధంగా యజమానులు సహకరించాలని తెలిపారు. వీటిలో జరిగే వీకెండ్ ఇతర కార్యకలాపాల సందర్భంగా మద్యం, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వాడకాన్ని నిరోధించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు ఒకదాని పేరుతో తీసుకొని మరో రకమైన కార్యకలాపాలు నిర్వహించే వారిపై సైతం యజమానులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.

ఇతర దేశాల మద్యం సరఫరా అయ్యే ప్రమాదం లేకపోలేదని సూచించారు. ఇది చట్ట ప్రకారం నేరమన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను ఇలాంటి కార్యకలాపాలు దెబ్బతీస్తాయని గుర్తు చేశారు. రిసార్ట్ లో పరిమితికి మించి సమీకరణ జరగకుండా చూడాలన్నారు. ఒకవేళ మద్యం సేవించాలనుకునే సందర్భంలో ఎక్సైజ్ శాఖ నుండి తప్పనిసరిగా అనుమతులు పొంది ఉండాలని గుర్తు చేశారు. ముద్ర, రేవ్ పార్టీల వంటివి నిర్వహిస్తే నిర్వాహకులతో పాటు రిసార్టు, ఫామ్ హౌస్ యజమానులు సైతం బాధ్యులను అవుతారని చెప్పారు. అంతే కాకుండా వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న యజమానులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదని సూచించారు. కుటుంబ సమేతంగా నిర్వహించే పార్టీల సైతం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇలాంటి పార్టీలు జరుగుతున్న సందర్భంలో సంబంధిత పోలీస్ స్టేషన్లో తప్ప సరిగా యజమానులు సమాచారం ఇవ్వాలని గుర్తు చేశారు.

తద్వారా అలాంటి ప్రోగ్రామ్లకు ముందు తమ పోలీసు సిబ్బంది ఆయా పరిసరాల్లో గస్తి నిర్వహించడం వల్ల తప్పు చేయాలనుకునే వారు సైతం వెనుకడుగు వేసేందుకు అవకాశం ఉందని సూచించారు. అనుకోని ఘటనలు జరిగితే పోలీసుల జోక్యం తప్పనిసరిగా పెరుగుతోందని చెప్పారు. రిసార్ట్, ఫామ్ హౌసుల్లో రికార్డింగ్ డ్యాన్సులు వంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులు అనుమతించబోమన్నారు. ఇలాంటి ఘటనలే తాజాగా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా.. గత వారం రోజుల క్రితం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీలో విస్తృతంగా అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్న తరుణంలో సంస్కృతిలో కూడా మార్పులు వస్తాయని తెలిపారు. ఇతర దేశస్థులు సైతం ఆయా ప్రాంతాల్లో వస్తున్న తరుణంలో సంస్కృతిలో కూడా మార్పులు వస్తాయన్నారు. ఏదేమైనా మన సంస్కృతి దెబ్బతినకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పోలీస్ గస్తీ తప్పనిసరిగా తిరుగుతోందని వివరించారు.

క్రైమ్ రేటు తగ్గించడంతో పాటు, రౌడీ షీటర్స్, డ్రగ్స్, గంజాయి నిరోధించే ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. రిసార్ట్లో అద్దెకి ఇచ్చే తరుణంలో తప్పనిసరిగా నిర్వాహకుల గుర్తింపు కార్డులను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రిసార్టు, ఫార్మ్ హౌస్ ల పరిధిలో తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతను కాపాడడం మనందరి బాధ్యతన్నారు. హెల్మెట్ లేకుండా, మధ్య సేవించి, వేగంగా డ్రైవింగ్ చేయడం నేరమన్నారు. తమ కుటుంబాలకు రోధన మిగిలించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు మహేందర్ రెడ్డి, సత్యనారాయ, రవి కుమార్, నందీశ్వర్, వేణు గోపాల్ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -