పత్రికా స్వేచ్ఛను హననం చేస్తున్న వైఖరిని మార్చుకోవాలి
ముక్తకంఠంతో ఖండించిన జర్నలిస్టులు, ప్రజా సంఘాలు
నవతెలంగాణ – వనపర్తి
మీడియాపై ప్రభుత్వాలు చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని, పత్రికా స్వేచ్చనహరణం చేస్తున్న వైఖరిని ఏపీ ప్రభుత్వం మార్చుకోవాలని వనపర్తి జిల్లా కేంద్రం జర్నలిస్టు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. సాక్షి ఎడిటర్ పై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ వనపర్తి జిల్లా కలెక్టరేట్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల పత్రిక విలేకరులు, మీడియా సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నాకు తరలివచ్చి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు, ప్రజా సంఘాల వక్తలు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో ప్రశ్నించే గొంతుకలకు వెన్ను దన్నుగా నిలిచిన పత్రికా ప్రపంచాన్నీ ఎవ్వరూ ఆపలేరన్నారు.
రాజ్యాంగానికి మూలమైన నాలుగు స్తంభాలలో ఒకటైన పత్రికా స్వేచ్ఛను ఎవ్వరూ ఆపలేరన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాల రాయలేరని, ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి కానీ పత్రికా ప్రపంచం ఎప్పుడూ ఉంటుందన్నారు. దాన్ని ఎవరూ ఆపలేరని సాక్షి పేపర్ ఎడిటర్ పై జరిగిన దాడిని సమాజమంతా ఖండిస్తుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులతో పాటు మండల కేంద్రాల్లోని విలేకరులు పాల్గొన్నారు.
మీడియాపై ప్రభుత్వ దాడులను ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES