రాజ్ భవన్ దగ్గర సీపీఐ(ఎం) నాయకులపై లాఠి చార్జి దుర్మార్గం
18న తెలంగాణ బంద్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో బిజెపి వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఖండించాలని రాజ్ భవన్ కు గవర్నర్ కు తెలుపడానికి వెళ్ళిన సీపీఐ(ఎం) నాయకులపై అక్రమంగా లాఠిచార్జ్ నీ సీపీఐ(ఎం) ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ,రాష్ట్ర కమిటి సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.
సీపీఐ(ఎం) నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా, కేంద్ర బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటున్న దానికి వ్యతిరేకంగా అక్టోబర్ 18 జరుగు తెలంగాణ బీసీ బంద్ జయప్రదం చేయాలని నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై బిజెపి నాటకం ఆడుతుందని కేంద్రంలో అడ్డుకుంటూ రాష్ట్రంలో బందుకు మద్దతు అంటూ రెండు నాలికల ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఈ ద్వంద వైఖరి బిజెపి మానుకొని కేంద్రంలో బిల్లును ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అఖిలపక్షం నిర్వహించి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని అన్నారు. బిజెపి ఒకవైపు కేంద్రంలో బీసీ రిజర్వేషన్స్ బిల్లులు, ఆర్డినెన్స్ లు అడ్డుకుంటూ ఇంకోవైపు రాష్ట్రంలో ఈనెల 18న బీసీ జేఏసీ రాష్ట్ర బందుకు బిజెపి మద్దతు ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటు అని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పోరాడితేనే ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బందులో పాల్గొంటామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు కోసం కులగనణ చేసింది. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు తో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయినా ఆరు నెలలైనా ఆమోదించలేదు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ ఆమోదించి గవర్నర్ కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 9 ని విడుదల చేసింది జీవో నెంబర్ 9 కి వ్యతిరేకంగా హైకోర్టుకు కొందరు వెళితే జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించింది.రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ పిటీషన్ను సుప్రీంకోర్టు తీరస్కరించింది.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది.బీసీ రిజర్వేషన్స్ అమలు పూర్తి బాధ్యత , బీసీ రిజర్వేషన్స్ పై రాజ్యాంగం 9వ షెడ్యూల్లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చేర్చితే ఏ సమస్య ఉండదు. బీసీలు అర్థం చేసుకోవాలి బిజెపి ఏ లా అడ్డుకుంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు అంటూనే అమలు చేయాల్సిన బాధ్యత అమలు చేయకుండా మేము మద్దతు అని బిజెపి అనడం సిగ్గుచేటు. రాష్ట్రంలో బిజెపికి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారని ఈ ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అక్టోబర్ 18న జరిగే బీసీ జేఏసీ తెలంగాణ బందుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. బిజెపి మద్దతు ఇచ్చింది. ఎవరికి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారు.. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. అంతకుముందు పెదగడియారం సెంటర్లో గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు.
ఈ బైక్ ర్యాలీలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హశం, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం గంజి మురళీధర్ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పట్టణ, మండల కమిటీ సభ్యులు తుమ్మల పద్మ కుంభం కృష్ణారెడ్డి అవుట రవీందర్ దండెంపల్లి సరోజ, కొండ వెంకన్న గుండాల నరేష్ గంజి నాగరాజు పోలే సత్యనారాయణ బొల్లు రవీంద్ర కుమార్ సలివోజు సైదాచారి సర్దార్ అలీ కత్తుల యాదయ్య సాగర్ల మల్లయ్య వెంబడి వెంకన్న మన్నె శంకర్ గడగోజు శ్రీనివాస చారి గంజి రాజేష్ నరసింహ రామకృష్ణారెడ్డి గిరి తెలకలపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.