హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహించారు. శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, ‘ఈ సినిమాని నేను చేయాలని డిసైడ్ అయినప్పుడు నా మనసులో ఒక భయం ఉండేది. యాక్టర్‌గా కాదు, రైటర్‌గా భయం ఉండేది. ప్రతి సీన్‌లో పంచులు లేకపోతే థియేటర్‌లో ప్రేక్షకుల్ని హోల్డ్ చేయగలమా లేదా అనే భయం ఉండేది.
ఈరోజు నాకు ఆ భయం పోయింది. ఈ సినిమాని విమల్ థియేటర్లో చూశాను. హౌస్ ఫుల్ షోస్ చూస్తుంటే మేము సక్సెస్ అయ్యామనే ఆనందం కలిగింది. సినిమాకి అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాని ఫ్రెండ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ ఎవరితో కలిసి వెళ్లిన సరే ఎంజాయ్ చేస్తారు. ఈ దీపావళికి మీకు హ్యాపీ మెమోరీ అవుతుంది’ అని తెలిపారు. ‘ఇది నా ఫస్ట్ ఫిలిమ్. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఉంది. ఆడియన్స్ సినిమాకు అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. ప్రీమియర్స్ నుంచి గ్రేట్ రియాక్షన్ వచ్చింది. మేము కనెక్ట్ అయిన పాయింట్‌కి ఆడియన్స్ కూడా అంతే అద్భుతంగా కనెక్ట్ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని డైరెక్టర్ నీరజ కోన చెప్పారు.
‘తెలుసు కదా..’కి విశేష ప్రేక్షకాదరణ
- Advertisement -
- Advertisement -



