Saturday, November 8, 2025
E-PAPER
Homeసినిమాఅందర్నీ థ్రిల్‌ చేసే 'జటాధర'

అందర్నీ థ్రిల్‌ చేసే ‘జటాధర’

- Advertisement -

హీరో సుధీర్‌ బాబు నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ‘జటాధార’. నవంబర్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు మహేష్‌ బాబు ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. జీ స్టూడియోస్‌, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించాయి. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ,’ట్రైలర్‌ లాంచ్‌ చేసిన మహేష్‌ బాబుకి థాంక్యూ. చిన్నప్పుడు విన్న ‘ఓ స్త్రీ రేపు రా’, ‘లంకె బిందెలు’ విన్నప్పుడు చాలా థ్రిల్‌ ఫీల్‌ అవుతాం. వెంకట్‌ వచ్చి కథ చెప్పినప్పుడు అంతేగా థ్రిల్‌ అనిపించింది. ఆడియన్స్‌ కూడా థియేటర్స్‌లో అదే థ్రిల్‌ ఫీల్‌ అవుతారు. ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. చాలా మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. తప్పకుండా చాలా ఎంజాయ్‌ చేస్తారు. సోనాక్షి చేసిన పెర్ఫార్మెన్స్‌ ఇంకెవరు కూడా మ్యాచ్‌ చేయలేరు. ధన పిశాచి పవర్‌ ఫుల్‌రోల్‌. శిల్పా క్యారెక్టర్‌ ఇందులో చూస్తే భయమేస్తుంది. సినిమా ఒక దమ్‌ బిర్యానిలా తయారైంది’ అని తెలిపారు.

‘ఇది నా ఫస్ట్‌ తెలుగు సినిమా. చాలా స్పెషల్‌. ధన పిశాచి లాంటి రోల్‌ ఇప్పటివరకూ చేయలేదు. ఒక యాక్టర్‌గా ఇలాంటి క్యారెక్టర్‌ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని హీరోయిన్‌ సోనాక్షి సిన్హా చెప్పారు. శిల్పా శిరోద్కర్‌ మాట్లాడుతూ,”బ్రహ్మ’ వచ్చిన చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని తెలిపారు. ‘తెలుగు ఇండిస్టీ మాకు చాలా స్పెషల్‌. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని నిర్మాత ఉమేష్‌ చెప్పారు. నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ,’మాకు సపోర్ట్‌ చేసిన జీ స్టూడియోస్‌కి కతజ్ఞతలు. సుధీర్‌ బాబుకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన వల్లే ఈ సినిమా తెలుగులో చేయగలిగాం’ అని అన్నారు. మరో నిర్మాత శివిన్‌ నారంగ్‌ మాట్లాడుతూ,’ఇది బ్లాక్‌ బస్టర్‌ స్క్రిప్ట్‌. తప్పకుండా సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -