- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మండలంలోని దామరకుంట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఎస్ జి ఎఫ్ క్రీడల్లో కోకో విభాగంలో ప్రథమ బహుమతులు సాధించారు. గురువారం రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లో జరిగినటువంటి ఎస్ జి ఎఫ్ కాబడ్డి, కోకో,వాలీబాల్ టోర్నమెంట్ అండర్ 14,17 కోకో విభాగంలో గురుకుల విద్యార్థినులు ప్రతిభ కనబర్చి, మొదటి స్థానం లో నిల్చి బంగారు పథకాలు పొందారు. బహుమతులు పొందిన విద్యార్థినిలు అండర్ 14 విభాగంలో అక్షర, సిరిని,అండర్ 17 విభాగంలో సహస్ర లను ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు.
- Advertisement -