Saturday, October 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపరువు పోగొట్టుకున్న ఈ.సి.ఐ

పరువు పోగొట్టుకున్న ఈ.సి.ఐ

- Advertisement -

బీహార్‌లో భారత ఎన్నికల సంఘం(ఈ.సి.ఐ) ప్రారంభించిన ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్‌)ను సందర్భాన్ని బట్టి చూస్తే విపత్కర ప్రభావాలు చూపబోతుందని చెప్పడం దిగ్భ్రాంతి కలిగించవచ్చు. అయితే ఇప్పుడు ఆ ప్రభావాలేమిటో బహిర్గతమవుతున్న పరిస్థితి. జూన్‌25న ఈ ప్రక్రియను ప్రారంభించి కొద్దిరోజుల్లోనే దాని అసలు లక్ష్యం ఓటర్ల జాబితాల ప్రక్షాళనను మించి ఇంకా చాలా వుండబోతోందని స్పష్టమైంది. ఆ కసరత్తులో మూడు ప్రత్యేక లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మొదటిది ఈ ప్రక్రియలో అతను లేక ఆమె ఓటర్ల జాబితాలో తన పేరు వుంచాలంటే పౌరులు నిరూపణకు తమ ఆధారాలను తామే సమకూర్చుకునే బాధ్యత తీసుకోవాలి.

గతంలోనైతే ఓటర్ల జాబితాల పున: పరిశీలన బాధ్యత ఇ.సి.ఐ నియమించిన ఎన్యూ మరేటర్లు నిర్వహించేవారు. కానీ ప్రస్తుత సందర్భంలోనైతే ఇప్పుడున్న లేక కాబోతున్న ఓటర్లు ఒక ఫారం సమర్పించడమే గాక ఇ.సి.ఐ నిర్దేశించిన పదకొండు పత్రాల్లో ఏదో ఓకటి చూపిం చాల్సి వుంటుంది. అధికార పత్రాల అందుబాటు స్థాయి చాలా తక్కువలోనే వుండే నేపథ్యంలో ఈ ప్రక్రియ పున:పరిశీలనకు గాక తొలగింపునకూ, తీసివేతకూ ఉద్దేశించబడిందని తేలిపోయింది. రాజ్యాంగం, తర్వాత వరుసగా అనేక సుప్రీంకోర్టు తీర్పులు గుర్తించిన సార్వత్రిక ఓటు హక్కు అనే సూత్రానికి తిలోదకాలు ఇస్తున్నట్టు అర్థమైంది.

మరిన్ని కీలక ప్రశ్నలు
రండవ ప్రశ్న ఈ.సి.ఐ ఓటరు పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు బలవంతాన లాక్కుంటున్నదా? రాజ్యాంగం 326వ అధికరణం ప్రకారం ఓటరు హక్కుకు సంబంధించి పౌరసత్వంపై యథా లాపంగా చేసిన ప్రస్తావన ఆధారంగా ఈ వాదన తీసుకురాబడింది. పౌరసత్వం వుండాలనే ముందస్తు షరతుకు మినహాయింపు లేదు గానీ దాన్ని నిర్ధారించే బాధ్యత మాత్రం ఈ.సి.ఐది కాదు. ఈ విషయంలో హోం మంత్రిత్వ శాఖకు బాధ్యత అప్పగించబడింది. ఏమైనా ‘సర్‌’ తతంగం ఈ అవ సరాన్ని తేలిగ్గా ఏక పక్షంగా తోసి పారేసింది. ఇక చివరగా కాలవ్యవధి. పెద్ద సంఖ్యలో వలస కార్మికులు జీవనోపాధి కోసం రాష్ట్రం వదలివెళ్లే బీహార్‌ వంటి రాష్ట్రంలో ఇచ్చిన ఈ కాలవ్యవధి చాలా స్వల్పం. అనేక ప్రాంతాల్లో వరద పరిస్థితుల వంటివి వుండగా వర్షా కాలంలో ఈ కసరత్తుకు అతి స్వల్ప వ్యవధి మాత్రమే లభించింది. బూత్‌స్థాయి అధి కారులు (బి.ఎల్‌.ఓ)లకు శిక్షణ లేని పరిస్థి తులలో ఇంత నిశితమైన ప్రక్రియ పూర్తి కావడం నిజంగానే అసంభవం.

కనుకనే ఈ విషయంలో వచ్చిన తుది ఫలితం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగిం చేదిగా లేదు. 81 లక్షల మందికి పైగా ఓటర్లు తుది జాబితాలో పేరు పొందలేక పోయారు. 1.38 కోట్ల మంది ఓటర్ల చిరు నామాలు అనుమానాస్పదంగా వున్నాయన్నారు. తొమ్మిది లక్షల మందికి పైగా మహిళా ఓటర్లు తమ ఓటుహక్కు కోల్పోయారు. 14 లక్షల మందికి పైగా ఓటర్లకు ఒకటికి మించిన ఎపిక్‌ కార్డులున్నట్టు తేలింది. 100 మందికి పైగా ఓటర్లు వున్న ఆవాసాలు 2258 వున్నాయి. కనుక ఇది పారదర్శకంగా జరిగిందనడానికి ఎలాంటి ఆధారం లేదు. ఫిర్యాదులు లేని స్వచ్ఛమైన జాబితా ఎంతమాత్రం కాదు ఇది, తుది ఓటర్ల జాబితాలు తీవ్ర సందేహాలకు నిలయంగా మారాయి.

బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసేందుకే ఈ తతంగం ఉద్దేశించబడిందని మొదటి నుంచి స్పష్టమవుతూనే వుంది. ఎందు కంటే గతంలో ఈ ఎన్నికలు హోరాహోరీ పోటా పోటీగా జరిగాయి. ఈసిఐ తలపెట్టిన ‘సర్‌’ను బలపర్చేందుకు రంగంలోకి దిగింది బీజేపీ మాత్రమే. సహజం గానే ప్రతిపక్షాలు, ఆందోళన చెందిన పౌరులు గట్టిగా ఎదిరించేందుకు ముందు కొచ్చారు. దీన్ని చక్క దిద్దేందుకు రాజ్యాంగం ఇచ్చిన ప్రతి వేదికనూ వాడుకోవడానికి ప్రయత్నించారు. రాజకీయ పార్టీలూ పౌర సంఘాలు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్లు ఇప్పటికీ సుప్రీంకోర్టు విచారణ లోనే వున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఈ.సి.ఐ ఆధార్‌ కార్డు అనే 12వ పత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పరిమిత మధ్యంతర ఉత్తర్వు ఇచ్చినప్పటికీ విస్తారమైన సమస్యలు మిగిలే వున్నాయి. ఓటర్ల సంఖ్య భారీ ఎత్తున తగ్గిపోయింది.

సమస్యలు సశేషమే
ఈ.సి.ఐ ప్రయత్నమంతా మోసపూరితంగా వుందనేది ఇప్పుడు కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. 2025 బీహార్‌ ఎన్నికలలో ‘సర్‌’ ప్రక్రియ చేపట్టడం అంటే…2003లో జరిగిందే మరోసారి జరుగు తున్నది తప్ప ఎంతమాత్రం అసాధారణం కాదని, ఈ.సి.ఐ ముందు నుంచీ వాదిస్తూ వచ్చింది. అయితే అప్పటి మార్గదర్శకాలను వెల్లడిం చాలని కోరగా ఎన్నికల సంఘం అందించలేదు. ఇందుకు సంబంధించి నాటి అధికార పత్రాలు అందు బాటులో లేవన్నది అపరిపక్వతను బయట పెట్టుకోవడమే గాక వ్యవస్థా గతమైన అసమర్థతను కూడా వెల్లడించుకుంది. అయితే వారు పచ్చి అబద్ధాలకు పాల్పడ్డారనేది ఇప్పుడు తేటతెల్లమైపోయింది. ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక (ఎ.డి.ఆర్‌) సుప్రీం కోర్టుకు నాటి ఈ పత్రాలను సమర్పించడాన్ని బట్టి ఇది అబద్ధమని తేలింది. 2003 ఆదే శాలు వేల పేజీలున్నాయి. ఈ కసరత్తు చేపట్టే తరుణంలో మూడు కోణాలలోనూ ఈ.సి.ఐ ఎలాంటి మోసానికి పాల్పడిందో ఇప్పుడు సంపూర్ణంగా తెలిసిపోయింది.

పచ్చి అబద్ధాలు
ఇంకా ఏమైనా గజిబిజి అంటూ వుండి వుంటే నరేంద్ర మోడీ దళపతి అయిన హోంమంత్రి అమిత్‌ షా దాన్నీ లేకుండా చేశారు. పౌరులు కాని వారిని గుర్తించి తొలగించి పంపించేయ డానికే ‘సర్‌’ ద్వారా ప్రయత్నం జరిగిం దని ఆయన చెప్పేశారు. ఈ వాదనను సమర్థిం చుకోవడం కోసం ఆయన దేశ ముస్లిం జనాభాలో సాపేక్షంగా వచ్చిన స్వల్ప పెరుగుదలను నొక్చి చెప్పారు. ఈ పెరుగుదలకు కారణం సంతానోత్పత్తి రేటు పెరగడం గాక పెద్ద ఎత్తున జరిగిన చొరబాట్లేనని ఆయన మరీమరీ చెప్పారు. దేశంలో ముస్లిం జనాభా 24.6 శాతం చొప్పున పెరిగితే హిందూ జనాభా 4.5 శాతం చొప్పున తగ్గిపోతూ వస్తోందని ఆయన లెక్కలు చెప్పారు. ఈ వాదన ఆధారం గానే ఆయన పార్టీ ప్రభుత్వం చొర బాటుదార్లను గుర్తిస్తానంటున్నది. ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడానికి చేయవలసింది మొత్తం చేస్తుంది. ఉత్తరోత్తరా వారిని స్వదేశాలకు పంపించేస్తుంది అన్నారు.

‘సర్‌’ నేపథ్యమేమిటో ఆయన స్పష్టంగానే ఏకరువు పెట్టారు. అయితే పహల్గాంలో ఉగ్రవా దులను పట్టుకోవడంలో విఫలమైనట్టే ఆయన మంత్రివర్గం చొరబాటుదారులను స్పష్టంగా ఎత్తిచూపడంలోనూ ఘోరంగా విఫలమైంది. ఆ విధంగా విఫలమైన కారణంగా ఆయన ఇప్పుడు ఇసిఐ భుజాల మీద తుపాకి పెట్టి కాల్చాలని ప్రయత్నిస్తున్నారు. భారీ సంఖ్యలో న్యాయమైన భారతీయ ఓటర్ల పేర్లు తొలగించబడినా సరే ‘సర్‌’ను ఎవరూ ఏ మాత్రం వ్యతిరేకించరాదని ఆయన చాలా మొండిగా కరుగ్గా చెబుతున్నారు. భారత దేశంలో జనాభా తీరుతెన్నుల గురించి ‘ప్యూ’ అధ్యయన కేంద్రం వెలువరించిన నివేదిక మతాల వారీ జనాభా వివరాలను పొందుపర్చింది. భారత దేశంలో మొత్తంగా జననాల రేటు తగ్గడమే కాదు. 2015లో ఈ తగ్గుదల దాదాపు అభివృద్ధి చెందిన సంపన్న దేశాలతో సమానంగా వుంది. ఇక భారతీయ ముస్లింలలోనూ జననాల రేటు ఒక మహిళకు 4.4 వుంటే ఇప్పుడు 2.6కు తగ్గి పోయింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ఆధారంగా చెబుతున్న లెక్కలివి.

అసలైన విషాదం
మరి చొరబాటుదారులు భారత దేశాన్ని హస్తగతం చేసేసుకుంటున్నారన్న కల్పిత కథ కాస్త యినా నిజం కాదని అమిత్‌షాకు చెప్పే వారెవరు? ఆయన ఉద్దేశం కేవలం అనిశ్చితిని, ఆభద్రతనూ పరస్పర ద్వేషాన్ని సృష్టించడం మాత్రమే. తద్వారా ఎన్నికల తరుణంలో మతపరమైన విభజన సృష్టించాలి. అయితే చాలా ప్రముఖంగా చెప్పుకో వలసిందేమింటే చొరబాటు దారులను గుర్తించడం కోసం జరిపిన ‘సర్‌’ ప్రక్రియ చివరకు తేల్చింది సున్నా. గుచ్చిగుచ్చి అడిగిన తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ తాము గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన విదేశీ జాతీయుల వివరాలేంటో చెప్పలేకపోయారు. కనుక పారదర్శకంగా, ప్రజాస్వామిక ప్రక్రి యగా జరగాల్సిన ‘సర్‌’ రాజ్యాంగ పాలనా వ్యవస్థల ను ధ్వంసం చేసే తప్పుడు తంతుగా దిగజార్చబడిందని ఇప్పుడు సూర్యోదయ కాంతి అంత స్పష్టంగా రుజువైపోయింది.
(అక్టోబరు 15 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -