Saturday, October 18, 2025
E-PAPER
Homeజాతీయంప్రజాగళం వినిపిస్తాం

ప్రజాగళం వినిపిస్తాం

- Advertisement -

బీహార్‌లో సీపీఐ(ఎం)అభ్యర్థులు
పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్లు దాఖలు

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే..ప్రజాగళం వినిపిస్తామని సీపీఐ(ఎం) అభ్యర్థులు తెలిపారు. మహాగట్‌ బంధన్‌ తరఫున నలుగురు సీపీఐ(ఎం) అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. బిభూతిపూర్‌ నుంచి అజయ్‌ కుమార్‌, మాంఝీ నుంచి సత్యేంద్రయాదవ్‌, హయాఘట్‌ నుంచి శ్యాం భారతి, పిప్రా నుంచి రాజ్‌మంగళ్‌ ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. శుక్రవారం బిభూతిపూర్‌ అసెంబ్లీ స్థానానికి సీపీఐ(ఎం) అభ్యర్థి అజయ్‌ కుమార్‌ నామినేషన్‌ పత్రం దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు అమ్రారామ్‌ హాజరయ్యారు. బీహార్‌ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ లాలన్‌ చౌదరి, కేంద్ర కమిటీ సభ్యులు అవ్ధేష్‌ కుమార్‌ కూడా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -