Saturday, October 18, 2025
E-PAPER
Homeబీజినెస్ఎంఈఐఎల్‌కు కువైట్‌ కంపెనీ భారీ ఆర్డర్‌

ఎంఈఐఎల్‌కు కువైట్‌ కంపెనీ భారీ ఆర్డర్‌

- Advertisement -

– దాదాపు రూ.1984 కోట్ల కాంట్రాక్టు
– కేఓసీకి గ్యాస్‌ స్వీటెనింగ్‌ ప్లాంట్‌ నిర్మాణం
నవ తెలంగాణ – హైదరాబాద్‌

కువైట్‌ ఆయిల్‌ కంపెనీ (కేఓసీ) నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) వెల్లడించింది. కెఒసి నుంచి ఏకంగా 225.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (దాదాపు రూ.1984 కోట్లు) విలువైన ఈ ప్రాజెక్ట్‌ ఆర్డర్‌తో మరో అంతర్జాతీయ మైలురాయిని అధిగమించామని ఆ సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.కేఓసీ బూస్టర్‌ స్టేషన్‌ బిఎస్‌ 171 సమీపంలో ఈ ప్లాంట్‌ ను 790 రోజుల్లో ఎంఇఐఎల్‌ నిర్మించి ఆ తరువాత ఐదు సంవత్సరాల పాటు నిర్వహించడానికి ఒప్పందం కుదర్చుకుంది. బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌ పద్దతిలో వెస్ట్‌ కువైట్‌ ఆయిల్‌ఫీల్డ్స్‌లో కొత్త గ్యాస్‌ స్వీటెనింగ్‌, సల్ఫర్‌ రికవరీ ఫెసిలిటీ (ఎన్‌జీఎస్‌ఎఫ్‌ ) రూపకల్పన, నిర్మాణ, నిర్వహణ, సంరక్షణ బాధ్యతలను ఎంఇఐఎల్‌ చేపట్టనుంది. ఎస్‌ఆర్‌యులో నాలుగు శాతం హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, 10 శాతం వరకు కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉన్న 120 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యుబిక్‌ ఫీట్ల (ఎంఎంఎస్‌సీఎఫ్‌డీ) సౌర్‌ గ్యాస్‌ను శుద్ధి చేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేయనుంది. ”పశ్చిమ కువైట్‌లోని ఈ వ్యూహాత్మక గ్యాస్‌ స్వీటెనింగ్‌ ఫెసిలిటీ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం మాకు గర్వకారణం.ఈ ప్రాజెక్ట్‌ మా సంస్థ పర్యావరణ భద్రత, సాంకేతిక నాణ్యత, ఆపరేషనల్‌ సామర్థ్యానికి ప్రతిబింబం. ప్రపంచస్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను అందించడంలో మా సమర్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది” అని ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ పి దొరయ్య పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -