Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమెదక్‌ డెస్క్‌ ఇన్‌చార్జి అనిల్‌ కుమార్‌కు ఘన నివాళి

మెదక్‌ డెస్క్‌ ఇన్‌చార్జి అనిల్‌ కుమార్‌కు ఘన నివాళి

- Advertisement -

సదాశివపేటలో అంత్యక్రియలు పూర్తి
హాజరైన నవతెలంగాణ సీజీఎం, మఫిషియల్‌ ఇన్‌చార్జి, హెచ్‌ఆర్‌ జీఎం
అంతిమయాత్రలో మిత్ర బృందం, సిబ్బంది
నివాళులర్పించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజ్‌, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత

నవతెలంగాణ-సదాశివపేట
నవతెలంగాణ ఉమ్మడి మెదక్‌ జిల్లా డెస్క్‌ ఇన్‌చార్జి అనిల్‌కుమార్‌ అంత్యక్రియలు శుక్రవారం సదాశివపేటలో ముగిశాయి. గురువారం సాయంత్రం 5 గంటలకు అనిల్‌ కుమార్‌ గుండెపోటుతో మృతి చెందగా ఆయన స్వగ్రామం సదాశివపేట పట్టణానికి మృతదేహాన్ని తరలించారు. అంత్యక్రియలకు నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్‌, మఫిషియల్‌ ఇన్‌చార్జి వేణుమాదవ్‌ రావు, జీఎం నరేందర్‌ రెడ్డి, మేనేజర్‌ రేవంత్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ ప్రభు నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అంతిమ యాత్రలో అనిల్‌కుమార్‌ మిత్ర బృందం హాజరై నివాళులర్పించింది. అలాగే, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజ్‌, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నర్సింలు పాల్గొని నివాళులర్పించారు. అదే విధంగా నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీడబ్య్లూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఎల్గొయి ప్రభాకర్‌, టీయూడబ్య్లూజే- ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైజల్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, విష్ణుప్రసాద్‌, సీనియర్‌ నాయకులు శర్మ, కృష్ణ, హజీ, అజిత్‌, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు అశోక్‌తో పాటు నవతెలంగాణ సిబ్బంది, రిపోర్టర్లు, బంధువులు, మిత్రులు, సదాశివపేట పుర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -