మఖ్దూంభవన్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనితో చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ వచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కంట్రోల్ కమిషన్ చైర్మెన్ కె నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, కలవేణ శంకర్, ఎం బాల నర్సింహ, భాగం హేమంతరావు, వీఎస్ బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుని వ్వాలని సీపీఐని మహేశ్‌కుమార్‌గౌడ్ కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గంలో చర్చించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతునివ్వాలని నిర్ణయం తీసుకున్నామని కూనంనేని సాంబశివరావు చెప్పారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES