ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా ఎంపికైన గ్రూప్-2కు ఎంపికైన అభ్యర్థులకు శనివారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు డి శ్రీధర్‌బాబు, ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరితోపాటు ప్రభుత్వ సలహాదారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ 29న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. 783 గ్రూప్-2 పోస్టులకు 782 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
గ్రూప్-2 అభ్యర్థులకు నియామకపత్రాలు నేడే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES