Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమల ఘాట్ రోడ్డుపై మళ్లీ చిరుత సంచారం

తిరుమల ఘాట్ రోడ్డుపై మళ్లీ చిరుత సంచారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల ఘాట్ రోడ్డులో మరోమారు చిరుత సంచారం భక్తుల్లో, స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో చిరుత సంచరించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రెండవ ఘాట్ రోడ్డు వద్ద సీసీ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అలిపిరి తనిఖీ కేంద్రం, వినాయక స్వామి ఆలయం మధ్య కుసుమ రహదారిలో నిన్న వేకువజామున మూడు గంటల ప్రాంతంలో చిరుత సంచరించింది. చిరుతను చూసి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -