Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: ఎమ్మెల్యే

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చేపట్టిన బీసీ బందుకు ఎమ్మెల్యే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఎమ్మెల్యే బైక్ పై జిల్లా కేంద్రంలో పురవీధుల గుండా బైక్ ర్యాలీలో  పాల్గొన్నారు. బీసీలకు న్యాయం  చేయాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -