నవతెలంగాణ-మల్హర్ రావు : ప్రజాపంపిణీ పథకం కింద పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లు కమీషన్ డబ్బుల కోస, పరేషాన్, అవుతూ ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. కమీషన్ డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో 19 మంది డీలర్లకు ఆరు నెలలకు సంబంధించి రూ.10 లక్షల పైనే బకాయిలు పేరుకుపోయాయి. మండలంలో 19 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా వరకు 9061 కార్డుదారులకు బియ్యం పంపిణీ అవుతోంది. ప్రతినెలా సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రేషన్ షాపుల డీలర్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.140 చొప్పున చెల్లిస్తోంది. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ సభ్యుల చేరికతో గత మూడు నెలల నుంచి అన్ని దుకాణాల్లో బియ్యం కోటా పెరిగింది. మార్చి వరకు సజావుగా జమ చెసిన ప్రభుత్వం ఇటీవల ఏప్రిల్ కమిషన్ జమ చేసింది. మే నుంచి అక్టోబర్ వరకు బకాయిలు పెరుకపోయాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనల ప్రకారం వేరువేరుగా జమ చేస్తుండడంతో డీలర్లు అయోమయంలో పడ్డారు.
డీలర్లు కమీషన్ల కోసం ప.రేషన్..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES