- మండల వ్యాప్తంగా రోడ్డు ఎక్కిన బీసీలు
నవతెలంగాణ-తుంగతుర్తి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ పిలుపుమేరకు మండల వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది.అత్యవసర సేవలు హాస్పిటల్స్,మెడికల్ షాపులు తప్ప మిగతావన్నీ బంద్ పాటించాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్, బీజేపీ,బీఆర్ఎస్,సీపీఐ(ఎం),సీపీఐ వివిధ విద్యార్థి సంఘాలు,ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
బీసీ బంద్‌లో బీజేపీ పాల్గొనడం సిగ్గుచేటని, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్,తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న విమర్శించారు. శనివారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతుగా నియోజకవర్గ కేంద్రంలో అన్ని పార్టీలు కలిసికట్టుగా పాల్గొని ర్యాలీ నిర్వహించి విజయవంతం చేశాయన్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ. రిజర్వేషన్ల అమలును అడ్డుకున్నదే బీజేపీ అని,ఇప్పుడు అదే పార్టీ బంద్ లో పాల్గొంటూ డ్రామాలాడుతుందని విమర్శించారు. ఒకవైపు చట్టపరంగా అడ్డంకులు సృష్టిస్తూ,
మరోవైపు ఇప్పుడు బీసీల కోసం చేపట్టిన బంద్ లో పాల్గొనడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుమలప్రగడ కిషన్ రావు,పట్టణ అధ్యక్షులు రాంబాబు,సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్,కొండరాజు,సిపిఐఎం నాయకులు ఓరుగంటి అంతయ్య, ఉప్పుల సోమయ్య,గడ్డం ఎల్లయ్య, మడిపెద్ది యాదగిరి,సిపిఐ నాయకులు రాజారాం,కోట రామస్వామి,సిపియు ఎస్ఐ నాయకులు మట్టపల్లి లింగయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు నాగమల్లు,బిజెపి మండల అధ్యక్షులు నాగరాజు,సుధాకర్, నరేష్,పులిపంపుల సైదులు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్,తునికి సాయిలు,మాజీ గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్,పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, రవికుమార్,నాగమల్లు,భాస్కర్, మధు,పరమేశ్,సోమన్న తదితరులు పాల్గొన్నారు..