Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం:  కాటారం మండలంలో BRS పార్టీ ఆధ్వర్యంలో సంపూర్ణ బంధు లో పాల్గొనడం జరిగింది. సంపూర్ణ బంధు కార్యక్రమంలో పాల్గొన్న BRS నాయకులు మాట్లాడుతూ..  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి లో జరిగినటువంటి ఎన్నికల బహిరంగ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని హామీ ఇవ్వడం జరిగిందని, గెలిచి 22 నెలల సమయం అయినప్పటికీ బీసీ బిల్లు అమలు చేయలేదని, ఈ రాష్ట్రంలో బీసీల ఓట్లు అధిక శాతం ఉన్నందున 420 హామీలల్లో బీసీ బిల్లు హామీ ఇచ్చి అమలు చేయక బీసీల యొక్క మనోభావాలతో వారి హక్కులతో ఆటలాడుతుందని రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో బీసీలు ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని దుయ్యబట్టారు.

ఈ సంపూర్ణ బందుకు మద్దతు ఇచ్చినటువంటి వర్తక వాణిజ్య వ్యాపారస్తులకు, స్కూల్ యాజమాన్యాలకు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ జోడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఊర వెంకటేశ్వరరావు, మాజీ ఎంపిటిసి బాసాని రవి, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంతకాన్ని సడవలి, ధన్వాడ మాజీ సర్పంచ్ రమణ, ఉప్పు సంతోష్, చారి,మేడిగడ్డ దుర్గారావు, చక్రి, రామిళ్ళ రాజబాబు, జాడి శ్రీశైలం, తూటి మనోహర్, ముక్తి తిరుపతి కాటారం మండలం బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -