Sunday, October 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅధికార లాంచనాల మధ్య పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంతక్రియలు 

అధికార లాంచనాల మధ్య పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంతక్రియలు 

- Advertisement -

– అంత్యకయలకు హాజరైన ఐజి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ఈ. ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య నిర్వహించారు. శనివారం తన స్వగృహం టౌన్ 3 పరిదిలోని న్యూ బ్యాంకు కాలనీ లో నివాళులు అర్పించారు. అంత్యక్రియలలో ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పీ.ఎస్., మల్టీ జోన్ 1, ఐజిపి నార్త్ తెలంగాణ, హైదరాబాద్, నిజామాబాదు పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య హాజరు అయి పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. అనంతరం ఐ జి చంద్రశేఖర్ రెడ్డి మృతిచెందన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అడిషనల్ డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి, అతనకు డిసిపి ( ఎ. ఆర్ ) రామచంద్ర రావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సిటి , సిసిఎస్ ఏసీపీలు , నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -