Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్42% రిజర్వేషన్ వచ్చేవరకు పోరాటం ఆగదు

42% రిజర్వేషన్ వచ్చేవరకు పోరాటం ఆగదు

- Advertisement -

– బీసీ బందు విజయవంతం…
నవతెలంగాణ – బొమ్మలరామారం 
:  తెలంగాణ బీసీ జేఏసీ రాష్ట్ర పిలుపుమేరకు బందును మండల కేంద్రంలో అఖిలపక్షం బడుగు బలహీన వర్గాల కులాలతో ఎస్టి ఎస్సి నాయకుల మద్దతుతో శనివారం విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రంలో 50 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వేసిన వెంటనే రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో కేసులు వేసి హైకోర్టులో స్టేజ్ తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగకుండా బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు ఆపడం సరైనది కాదని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చే వరకు బీసీల అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

42 శాతం అంటే ఉద్యోగాలు ఉపాధి తో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం తెచ్చే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. తమిళనాడు ఏదైతే జీవో నెంబర్ 9 తెచ్చి బీసీలకు చట్టబద్ధత కల్పించారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు 42% వచ్చేవరకు పోరాటం చేస్తామని అన్నారు. బీసీ బందుకు కాంగ్రెస్.బి అర్ ఎస్. బిజెపి. సిపిఐ. సిపిఐ ఎం. ఎమ్మార్పీఎస్. లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు. ఎస్టి నాయకులు మద్దతు ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. మండల కేంద్రంలో భారీగా తరలివచ్చిన బీసీ నాయకులు రెండు గంటలకు పైగా మహాధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలుదేరి స్వచ్ఛందంగా బందులో పాల్గొనాలని ఎంపీడీవో ఎమ్మార్వో మిగతా ప్రభుత్వ ఆఫీసులలొ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్డౌన్ కార్యక్రమం కూడా చేయాలని కోరారు. ప్రైవేట్ రంగ కంపెనీలు సైతం స్వచ్ఛందంగా బందు పాల్గొనాలని మూసివేశారు… బీసీ అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కు మెమోరండం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ అఖిలపక్ష నాయకులు అన్ని బిసి కుల సంఘాల అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్టి నాయకులు మహా ధర్నాలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -