Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ బిల్లుకు బీజేపీ అనుకూలమా..వ్యతిరేకమా..? 

బీసీ బిల్లుకు బీజేపీ అనుకూలమా..వ్యతిరేకమా..? 

- Advertisement -

– కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజు 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల : బీసీల 42 శాతం బిల్లుకు బీజేపీ అనుకూలమా వ్యతిరేకమా తెలపాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురువ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. శనివారం రాష్ట్ర బందులో భాగంగా మానవపాడు మండల కేంద్రంలో కెవిపిఎస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంధు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల తాసిల్దార్ ఎంపీడీవో ఎంఈఓ ఐసిడిఎస్ వెలుగు గ్రంథాలయం ఎస్బిఐ బ్యాంకు సహకార బ్యాంకు కస్తూర్బా తదితర కార్యాలయాలను మూసి వేయించారు. ఈ సందర్భంగా రాజు కురువ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణలో బీసీ బిల్లుకు బిజెపి మద్దతు ఇస్తూ ఢిల్లీలో బిల్లు ఆమోదించకుండా వ్యతిరేకిస్తుందని బిజెపి ద్వంద వైఖరి మానుకోవాలని అన్నారు.

బీసీ నాయకునిగా ఉన్న బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బిజెపికి రాజీనామా చేయాలని అన్నారు. భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో బీసీ బిల్లు చేర్చాలని అన్నారు. తెలంగాణ శాసనసభ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపిన బీసీ బిల్లుకు బిజెపి అడ్డుపడుతుందని బిజెపి ఆడుతున్నడ్రామాలను బీసీలు పసిగట్టాలని అన్నారు. బీసీ బిల్లు రాష్ట్ర గవర్నర్కు పంపిన కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు ఆమోదించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

112 బిసి కులాలు 56% జనాభా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు 10% ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు అమలు చేసిన మోడీ బీసీ ప్రధాని బీసీలను మోసం చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీసీలకు న్యాయం జరగడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భరత్ రెడ్డి యువజన అధ్యక్షుడు శేఖర్ మధు నాగరాజు మాలిక్ ప్రభాకర్ ఎమ్మార్పీఎస్ నాయకుడు శీను మాదిగ రాముడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -