Sunday, October 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుట్రాక్టర్ స్కూటీ ఢీకొని మహిళా ఏఎన్ఎం మృతి

ట్రాక్టర్ స్కూటీ ఢీకొని మహిళా ఏఎన్ఎం మృతి

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్ : ప్రమాద వశాత్తూ ట్రాక్టర్ స్కూటీ ఢీకొని మహిళా ఏఎన్ఎం మృతిచెందిన ఘటన మండలంలోని వర్కట్ పల్లిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మండలకేంద్రానికి చెందిన పోలేపాక (దేవరాయ) సుజాత (43) అను ఆమె వృత్తి రీత్యా వర్కట్పెల్లిలోనీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏఎన్ఏంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం ఇంటి నుండి బయలుదేరి ఆసుపత్రిలో విధులు ముగించుకొని తన కొడుకు దేవన్స్ ను తీసుకొని స్కూటీపై తిరిగి ఇంటికి వస్తుండగా ఆస్పత్రి సమీపంలో అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొని తలపై నుండి ట్రాక్టర్ టైర్ వెళ్ళడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కుమారునికి కాలు విరిగి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్థులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లి పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -