నవతెలంగాణ – ఆర్మూర్ : జిల్లాలో 108 సేవల సంస్థలో 2022 నుండి 2024 వరకు సేవలు అందించిన జిల్లా కోఆర్డినేటర్ విజేందర్ హైదరాబాద్ లో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని 1962 కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్ సోమవారం తెలిపారు. జిల్లాలో ఉద్యోగులతో జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయం చేస్తూ జిల్లాను అత్యవసర సేవల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపి జిల్లాను ముందుకు తీసుకెళ్లారు. ఈసందర్భంగా వారి సేవలను స్మరిస్తూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 108,102,1962 ఉద్యోగులు చిత్ర పటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా నుండి పెద్ద సంఖ్యలో 108 102 1962 ఉద్యోగులు ఈరోజు వారి అంత్యక్రియలకు స్వగ్రామమైన ములుగు జిల్లా రేగొండ మండలం రాయపల్లిలో పాల్గొన్నారు. వారి అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబానికి మనో ధైర్యం కల్పించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 108 ఉద్యోగుల సంక్షేమ సంగం రాష్ట్ర కార్యదర్శి సుంకరి విజయ్,108 జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు ఆనంద్, భీంరావు, రాజు,1962, సాయి భారత్, పోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.
విజేందర్ కు ఘన నివాళులు..
- Advertisement -
- Advertisement -