- Advertisement -
నవతెలంగాణ – తాడ్వాయి : మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన మాచర్ల సతీష్ అనే రైతు దాన్యం బస్తాలు లారీలో లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెట్ కూలి బస్తాలు ఆయనపై పడ్డాయి. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. కానీ తీవ్రమైన గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని రైతులు, గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ధాన్యం బస్తాలు లారీపై లోడు చేసేటప్పుడు, మిల్లుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, ఇల్లుల వద్ద తరలించే సమయంలో కొన్ని ఇబ్బందులు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -