నవతెలంగాణ – పెద్దవంగర: ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో 550 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. సోమవారం కొడకండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మండలానికి చెందిన 30 విద్యార్థులను శాలువా, మెమోంటో తో పాటుగా రూ. 3 వేలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు కార్పొరేట్ కు దీటుగా ర్యాంకులు సాధించారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, బానోత్ సీతారాం నాయక్, దాసరి శ్రీనివాస్, సంకెపల్లి రవీందర్ రెడ్డి, గద్దల ఉప్పలయ్య, మహేష్, సంపత్, కేజీబీవీ ప్రత్యేకాధికారి గంగారపు స్రవంతి, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే..
- Advertisement -
- Advertisement -