- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భద్రాచలం ఐటీడీఏకు న్యూఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం రాత్రి బెస్ట్ అవార్డు లభించింది. ధర్తీ అభాజాన్ జాతీయ గౌరవ అభియాన్, ఆదికర్మయోగి అభియాన్ పథకాల ద్వారా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమంలో ప్రతిభ ఆధారంగా ఈ అవార్డును అందజేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. 2030 నాటికి 130 గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం ఈ స్కీం లక్ష్యం.
- Advertisement -