Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దీపావళికి విభిన్న ప్రమిదలు

దీపావళికి విభిన్న ప్రమిదలు

- Advertisement -

ఆకట్టుకుంటున్న వెరైటీ ప్రమిదలు
కొనుగోలుకు ప్రజల ఆసక్తి
మార్కెట్ అంతా దీపావళి శోభ
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ నేపథ్యంలో మార్కెట్లో వివిధ రకాల ప్రమిదలు జిల్లా, నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వివిధ రకాల ప్రమిధలను, రంగు రంగుల బల్బులను, విద్యుత్ కాంతితో ఉన్న వివిధ రకాల పరికరాలను కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతికత రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న రోజుల్లో కొత్త రకం దీపాలు విద్యుత్తో వెలుగే దివ్వెలు అందుబాటులోకి వచ్చాయి. విభిన్న రకాల దీపాలు మార్కెట్లో ఉండడంతో ప్రజలు ఆయా దీపాల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇల్లు అంత సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దుకుంటున్నారు.

దీపాలతో నగర వాసులు కాస్త ఖరీదైనప్పటికీ ఆకర్షణీయంగా ఉండే దీపాలను కొనేందుకు సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు అంత మట్టి దీపాలు ఉండేవి కానీ ఇప్పుడు మట్టితో పాటు పింగాణీ, రాగి, విద్యుత్ శక్తితో నడిచే దీపాలు అందుబాటులోకి వచ్చాయి. దీపావళి రోజు లక్ష్మి పూజలు నిర్వహిస్తారు. అందుకే దీపావళి రోజు ఇంటిని దీపాలతో అలంకరిస్తే పండుగ శోభాతో పాటు లక్ష్మి దేవి కటాక్షం కలుగుతుందని భావిస్తున్నారు. మహిళలు దీపావళితో పాటు కార్తీక మాసం కూడా మొదలవుతుండడంతో పెద్ద మొత్తంలో దీపాలు కొనేందుకు వస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -