Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిసి బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు

బిసి బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నిన్న రాష్ట్రవ్యాప్త బందుకు శనివారం పిలుపునివ్వడంతో నిజామాబాద్ జిల్లాలో బందు పెద్ద ఎత్తున విజయవంతమైంది అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ బందుకు సహకరించిన ప్రతి ఒక్కపిలుపునివ్వడంతో నాయకులకు, కుల సంఘాల నాయకులకు, వివిధ వర్తక సంఘాల నాయకులకు, వివిధ సేవా సంఘాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.

ఈ బందుకు మద్దతు ఇచ్చి బందులో బందులో పాల్గొన్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నాడు. ఈ బందు ఆరంభం మాత్రమే మాకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఇంకా పోరాట స్ఫూర్తితో పోరాట పటిమతో పోరాడుతామని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ తో పాటు బుస్సా ఆంజనేయులు, కరిపే రవీందర్, కొయ్యాడ శంకర్, మాడవేడి వినోద్, బగ్గలి అజయ్, శ్రీలత, విజయ్, చంద్రకాంత్, బసవసాయి, చంద్రమోహన్, నరసయ్య వాసంజయ, ఓంకార్, మురళి కైరం కొండ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -