Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడుదాం

భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడుదాం

- Advertisement -

CLC రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు
నవతెలంగాణ- నిజామాబాద్ సిటీ 

పౌరహక్కుల సంఘం (CLC) ఉమ్మడి జిల్లా 17వ మహాసభ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ మహాసభకు సంఘం రాష్ట్ర నాయకులు వి.సంఘం అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తలుగా వచ్చిన పౌర హక్కుల సంఘం (CLC) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్. నారాయణరావులు మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం గత ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ, ముందుకు సాగుతున్నదన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యమం, తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే ప్రజలతో కలిసి హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తున్నదన్నారు.

కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు, మణిపూర్ నుండి గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లోని హక్కులని, మారణ హోమానికి వ్యతిరేకంగా కార్యచరణ కొనసాగిస్తున్నదన్నారు. ప్రభుత్వ వర్గాలు ప్రాంతం, జాతి, మతం, కులాల పేరుతో కొనసాగిస్తున్న అన్ని రూపాల్లోని అణచివేతను పౌర హక్కుల సంఘం ప్రశ్నిస్తున్నది, ప్రజలకు అవగాహన కలిగిస్తున్నదన్నారు. 

హైకోర్టు న్యాయవాది, సీఎల్సీ రాష్ట్ర నాయకులు వి.రఘునాథ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ఉందన్నారు. కానీ ఇందిరాగాంధీ మొదలు నరేంద్ర మోడీ వరకు ప్రాథమిక హక్కుల అణిచివేత తప్ప ప్రజాస్వామ్యయుత పరిపాలనకు ఈ దేశ ప్రజలు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కర్షక పోరాటాలకు, కనీస భావప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితులు నిర్బంధం కొనసాగుతున్నదన్నారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు గొంతు విప్పాలన్నారు. 

సీఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు జలంధర్, బీక్ సింగ్, భాస్కరస్వామి, విజయరామరాజు, ప్రవీణ్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, వెంకన్న, జెవివి రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు, పీవోడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, వివిధ ప్రజాసంఘాల నాయకులు బి.మల్లేష్, నారాయణ, గంగారం, సునంద, అమూల్య, చంద్రశేఖర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -