నవతెలంగాణ-హైదరాబాద్: పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం.. సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించలేదని సీఎం రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ వచ్చాక సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పించిందని సీఎం తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ అభివృద్ధికి యాదవుల సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
