ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు..
ఆర్టీఐ నాయకులు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, చింతల కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి అని..దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ లు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామన్నారు. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగతో తెలంగాణ లోనూ చీకట్లు తొలగి మళ్లీ అభివృద్ధితో వెల్లివిరియాలన్నారు. అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించాలన్నారు. అలాగే బాణసంచా పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..చిన్నపిల్లలను బాణాసంచాకు దూరంగా ఉంచాలని సూచించారు.
చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES