Sunday, October 19, 2025
E-PAPER
Homeజిల్లాలుకమ్యూనిస్టులు పురోగమి శక్తులు..

కమ్యూనిస్టులు పురోగమి శక్తులు..

- Advertisement -

రానున్న కాలం ఎర్రజెండాది..
రామన్నపేటలో ద్విచక్ర వాహనాల ర్యాలీ..
రామన్నపేట యువ కమ్యూనిస్టుల సమ్మేళనంలో సీపీఐ(ఎం)కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం. .
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సమాజంలో జరుగుతున్న చెడును ఎదిరించి సమాజం మేలు కోసం పనిచేసే పురోగమి శక్తులు కమ్యూనిస్టులు అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఆదివారం యువ కమ్యూనిస్టుల సమ్మేళనం నిర్వహించారు. మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్, సుభాష్ విగ్రహం మీదుగా పార్టీ కార్యాలయం వరకు  ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. యువ సమ్మేళనం ప్రారంభ సూచికగా సీపీఐ(ఎం) జెండాను తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు.  భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు

అనంతరం పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. దేశంలో పెట్టుబడిదారీ విధానాల వల్లనే అసమాన తలు పెరుగుతున్నాయని, ప్రజలకు కనీస అవసరాలు కల్పించలేని పాలక విధానాల కు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రానున్న కాలం ఎర్రజెండదని కమ్యూనిస్టులు పురోగమి శక్తులుగా అవతరిస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీలంక లాంటి పరిణామాలే నిదర్శనం అన్నారు.

ప్రజలకు విద్యా వైద్యం కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని, ఎన్నికల్లో గెలవడం కోసం అమలు కానీ ఆచరణలేని హామీలు ఇచ్చి, గెలిచాక ప్రజల్ని ఆర్థిక సంక్షేమంలోకి నెట్టేసి ప్రజా వ్యవస్థను చిన్న బిన్నం చేస్తున్నాయన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రాణాలకు జడవకుండా పోరాటం చేస్తున్నది  కమ్యూనిస్టులేనని అన్నారు. బిజెపికి ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర లేదని, స్వతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసి నేడు మేము దేశభక్తులమని అబద్ధ ప్రచారం చేసే ఆర్ఎస్ఎస్ ను యువత తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో జరుగుతున్న అసమానతలు అంతరాలపై యువ కమ్యూనిస్టులు సంఘటితంగా పోరాడాలన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -