Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలను నిరాశ పరుస్తోంది

కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలను నిరాశ పరుస్తోంది

- Advertisement -

శారద అంగన్వాడి యూనియన్ రాష్ట్ర నేత
ఘనంగా అంగన్వాడి ద్వితీయ మహాసభలు
నవతెలంగాణ – మక్తల్

ఆదివారం మక్తల్ పట్టణ కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా రెండవ మహాసభలు ఘనంగా ప్రారంభమైనాయి. మక్తల్ పట్టణ కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ఎస్ఆర్ఎం ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించారు.

 ఈ సభలో ముఖ్య వత్తగా హాజరైన రాష్ట్ర నాయకురాలు శారద ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు అనేక ఆన్లైన్ పనులు అప్పజెప్తా ఉన్నాయని అయితే ఆన్లైన్లో పనులు చేసేందుకు మొబైల్ ఫోన్లు సహకరించడం లేదని, పాత ఫోన్లు పని చేయడం లేదని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానం వలన అంగన్వాడి కేంద్రాల ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఫ్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడీలకే అప్పచెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. పెరుగుతున్న ధరలు కనుగుణంగా మెస్స్ చార్జీలను పెంచాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.పోషణ అభియాన్, పోషన్ ట్రాక్ ,ఫేస్ క్యాప్చర్ ,బయోమెట్రిక్ విధానం వలన అంగన్వాడీలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ మ మహాసభలలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి జిల్లా కార్యదర్శి బాల్ రామ్, జిల్లా ఉపాధ్యక్షులు పుంజనూర్ ఆంజనేయులు ప్రసంగించారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరాజు ఈ మధ్యకాలంలో మరణించిన అంగన్వాడీ టీచర్లకు వెలుపలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నిమిషం పాటు లేచి మౌనం పాటించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జోషి ప్రసంగించారు ఈ సభలకు అధ్యక్షత యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి శశికళ అధ్యక్షత వహించగా, ఈ మహాసభకు శ్రీమతి మంజుల, శ్రీమతి భారతి ,అధ్యక్షత వర్గంగా వ్యవహరించారు ఈ మహాసభలలో యూనియన్ జిల్లా కార్యదర్శి మంజుల నాయకులు నాగజ్యోతి, కవిత, భారతి విజయలక్ష్మి, చంద్రకళ, రాధిక రామ్లింగమ్మ తదితరులతోపాటు మక్తల్ మద్దూర్ నానిపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్రు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -