Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాస్థాయి ఖోఖో క్రీడాకారుల ఎంపికలు

జిల్లాస్థాయి ఖోఖో క్రీడాకారుల ఎంపికలు

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
కల్వకుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో జరుగుతున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి 58వ ఖోఖో క్రీడ కార్ల ఎంపిక కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఖోఖో సెలక్షన్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వివిధ మండలాల నుంచి క్రీడ కారులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విలియం పాల్గొని క్రీడాకారులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రతిసారి జరిగే క్రీడల్లో గర్ల్స్ విభాగం నుంచి గోల్డ్ మెడల్ తీసుకొచ్చామని నెక్స్ట్ రాబోయే రోజుల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో మొదటి బహుమతి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం కల్వకుర్తి పట్టణంలో నిర్వహించడం చాలా సంతోషదాయకమని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గోకమళ్ళ రాజును అభినందించారు. కల్వకుర్తిలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి విద్యార్థులను ప్రోత్సహించాలని, క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్గనైజర్ గోకమళ్ళ రాజు, తెలంగాణ ఉద్యమకారుడు కూన స్కైలాబ్, కల్వకుర్తి ప్రాంతంలోని పీడీలు, పీఈటీలు, క్రీడ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -