నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకటిని తరిమేసినట్టుగానే..మనుషుల్లో అజ్ఞానమనే చీకటిని తొలగిస్తూ..జ్ఞాన వెలుగులు నింపే దీపాల పండుగ దీపావళి” అని మంత్రి పేర్కొన్నారు.
ఈ దీపావళి ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలనీ,ఆ లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇల్లు సకల శుభాలు, పాడి పంటలు,సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వెల్లివిరియాలనీ ఆకాంక్షించారు. పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు పిల్లలు,పెద్దలు పటాకులు కాల్చేటప్పుడు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ.. ఈ దీపావళి పండుగ అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు. రాక్షస సంహారంతో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ పురస్కరించుకుని మరొక్కమారు ప్రజలకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: మంత్రి కోమటి రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES