ఎమ్మెస్సార్ జాతీయ స్థాయి కథల పోటీ- 2025
కీ.శే. శ్రీ మలిశెట్టి సీతారామ్ గారి స్మారకార్థం జాతీయస్థాయి కథల పోటీకి నవ్యత, సృజన, సామాజిక స్పృహ కలిగిన కథలకు ఆహ్వానిస్తున్నారు. బహుమతి పొందిన కథలతో పాటు మరి కొన్ని ఎంపిక చేసిన ఉత్తమ కథలతో ‘కథా ప్రపంచం 2025’ పుస్తకం ప్రచురిస్తారు. ఒక సీనియర్ సాహితీవేత్తకు శ్రీ మలిశెట్టి సీతారామ్ స్మారక జీవన సాఫల్య సాహితీ పురస్కారం-2025, సాహితీవేత్తకు శ్రీ మలిశెట్టి సీతారామ్ స్మారక వార్షిక సాహితీ పురస్కారం అందజేస్తారు. కథలు కేవలం email:msrtelugusahityam@gmail.com మెయిల్ ద్వారా మాత్రమే నవబర్ 30లోగా ‘శ్రీ మలిశెట్టిసీతారామ్ స్మారక ఎడ్యుకేషనల్ సొసైటీ (Regd%#84/07), ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు పంపాలి. వివరాలకు యుగంధర్: 93947 82540, శాస్త్రి : 88857 62720
అనువాద రచనలు, కవితా ప్రక్రియల పోటీ
పీఠికాపుర సాహితీ కళావేదిక, శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంధాలయం సంయుక్తంగా వితరణ శీలి బాదం మాధవరావు గారి జ్ఞాపకార్ధం తెలుగు అనువాద సాహిత్యంలో కథలు, కవిత్వం, కవితా ప్రక్రియలో పద్యకవిత్వం, హైకూలు, మినీకవిత, దీర్ఘకవితలను పోటీ నిర్వహిస్తున్నారు. పోటీకి 2018 తర్వాత ముద్రించిన రచనలను రెండు కాపీలను నవంబర్ 25 లోపు ‘నిర్వాహకులు, శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంధాలయం, పాత బస్టాండు వద్ద, మెయిన్ రోడ్, పిఠాపురం – 533450’ చిరునామాకు పంపాలి. వివరాలకు : 9494553425, 9133023086.
బాదం సూర్య ప్రకాష్.
రక్తదానం ఆవశ్యకతపై కవితలకు ఆహ్వానం
రక్తదాన ఆవశ్యకతపై అవగాహన, ప్రేరణ కలిగించే అంశాలతో అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థ కవితలను ఆహ్వానిస్తున్నాం. ఎంపిక చేయబడిన కవితలతో సంకలనం ప్రచురిస్తారు. 25 లైన్లకు మించని కవితలను వర్డ్, పిడిఎఫ్ రూపంలో నవంబర్ 30 లోపు ircshnk@gmail.com మెయిల్‌కు, 98492 61210 నెంబర్‌కు వాట్సాప్‌లో పంపాలి.
డా|| పి విజయ్ చందర్ రెడ్డి
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -