పేదల ఇండ్లపై ప్రతాపం మానుకోవాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘ఇంతకు ముందు లెక్క ఉండది..అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తాం’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజేంద్ర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, ఆయన కుమారుడు పెద్దషాపూర్ మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్, 2018లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన అంజిబాబు దంపతులు తమ అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆక్రమణల పేరుతో పేదల ఇండ్లను కూల్చిన సర్కార్.. ఇప్పటివరకు ఒక్క బడా వ్యక్తి ఇంటిని ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు చెరువులోనే ఉందనీ.. ఆ ఇంటి జోలికి మాత్రం వెళ్లడం లేదని విమర్శిం చారు. పట్నం మహేందర్‌రెడ్డి గెస్ట్‌హౌస్, మంత్రులు పొంగులేటి శ్రీనివా సరెడ్డి, వివేక్, కేవీపీ రామచంద్రరావు ఇండ్లు చెరువులోనే ఉన్నా వాటిని ఎందుకు ముట్టుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని ఆరోపించారు. తనతో పాటు సబితా ఇంద్రారెడ్డి భూములను చూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి తీసుకువెళ్లామనీ, కాంగ్రెస్ పాలనలో పారిశ్రామివేత్తలకు తుపాకులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ తప్పుడు ప్రచారాలు మానుకోవాని కేటీఆర్ హితవు పలికారు.
అందరి లెక్కలు తేలుస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES