పోర్చుగల్ పార్లమెంట్ ఆమోదం…వ్యతిరేకించిన వామపక్షాలు
లిస్బన్ : బహిరంగ ప్రదేశాల్లో బురఖా, నఖాబ్ (ముస్లిం మహిళలు కప్పుకునే ముసుగు) ధరించడాన్ని పోర్చుగల్ ప్రభుత్వం నిషేధించింది. దీనికి సంబంధించిన బిల్లును పోర్చుగల్ పార్లమెంట్ ఆమోదించింది. సంప్రదాయ విలువలను పాటించే చెగా పార్టీ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా, నఖాబ్ ధరిస్తే రూ.20,000 నుంచి నాలుగు లక్షల రూపాయల వరకూ జరిమానా విధిస్తారు. బురఖా ధరించాల్సిందిగా ఒత్తిడి చేస్తే మూడేండ్లు జైలు శిక్ష పడుతుంది.
అయితే విమానాలు, మత ప్రదేశాలు, రాయబార కార్యాలయాల్లో బురఖా ధరించడాన్ని అనుమతిస్తారు. ఫ్రాన్స్, ఆస్ట్రియా, బెల్జియం, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇప్పటికే ఈ నిషేధం పూర్తిగానో లేదా పాక్షికంగానో అమలులో ఉంది. బిల్లుపై దేశాధ్యక్షుడు మార్సెలో రెబోలో డి సౌసా ఇంకా సంతకం చేయలేదు. ఆయన ఈ బిల్లును తిరస్కరించవచ్చు లేదా పరిశీలన కోసం న్యాయస్థానానికి నివేదించవచ్చు. బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగిన సందర్భంగా వామపక్ష మహిళా సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. చెగా పార్టీ నేత ఆండ్రే వెంటురాతో వారు వాగ్వివాదానికి దిగారు. అయితే ఇతర పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది.
బహిరంగ ప్రదేశాల్లో బురఖా, నఖాబ్‌పై నిషేధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES