Monday, October 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమోతుగూడలో ఘోర ప్రమాదం

మోతుగూడలో ఘోర ప్రమాదం

- Advertisement -

కారు ఢీకొని ముగ్గురు దుర్మరణం
ఒకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా మోతుగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే…వాంకిడి మండలం బెండార గ్రామానికి చెందిన జగన్‌(26) దీపావళి పండుగకు కాగజ్‌నగర్‌ మండలం వంజరి గ్రామంలో నివాసముంటున్న బావ డోంగ్రి సిద్ధార్థ ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి అక్క అనసూర్య(35), అల్లుడు ప్రజ్ఞశీల్‌(4), కోడలు హరికను తీసుకొని బైక్‌పై స్వగ్రామం బెండారకు బయలు దేరాడు. మోతుగూడ వద్ద ఫ్లైఓవర్‌ ఎక్కుతున్న క్రమంలో వెనుక నుండి అతివేగం తో వచ్చిన కారు బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న నలుగురు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్‌ పై నుండి పక్కన ఉన్న సర్వీస్‌ రహదారిపై పడ్డారు. దీంతో అనసూయ, జగన్‌, ప్రజ్ఞాశీల్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. హరికకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే హరీష్‌బాబు సందర్శించి బాధిత కుటుంబీకులను ఓదార్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -