- Advertisement -
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్‌ను డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్ ఓటమితో ముగించింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్ 15-13, 9-15, 15-8, 15-13తో కాలికట్ హీరోస్‌పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఆరో ఓటమితో పీవీఎల్ 4 గ్రూప్ దశ నుంచే కాలికట్ హీరోస్ నిష్క్రమించింది. మౌషిన్ పా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
- Advertisement -