Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి కుమార్తె మృతి..

హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి కుమార్తె మృతి..

- Advertisement -

బూర్గుల సుమన మృతి పట్ల పలువురు ప్రముఖుల దిగ్బ్రాంతి..
నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ 

ఉపాధ్యాయురాలు, ప్రజాసేవకురాలు, సర్పంచ్, ఎంపీటీసీగా ప్రజల మన్ననలు పొందిన హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తమ్ముడి కుమార్తె బూర్గుల సుమన అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున పరమపదించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామ మాజీ ఎంపీటీసీ,  సర్పంచ్ బూర్గుల సుమన అనారోగ్యంతో  ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఈమె హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడి కుమార్తె, సాయుధ రైతాంగ పోరాట యోధుడు బూర్గుల నరసింగరావు చెల్లెలు. ఈమె బూర్గుల గ్రామానికి ఎంపీటీసీ, సర్పంచ్ గా సేవలందించారు.. అంతే కాకుండా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో తాను  టీచర్ గా తన దగ్గర విద్యనభ్యసించిన ఆ నాటి విద్యార్ధుల సహకారంతో బూర్గుల గ్రామాభివృద్ధి కోసంలో  ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ ను స్థాపించి ఉమ్మడి బూర్గుల గ్రామపంచాయతీలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది.

ప్రభుత్వ సహకారంతో గ్రామంలో మరుగుదొడ్లు, ప్రగతి వెల్ఫేర్ ఆధ్వర్యంలో మహిళలకు అనేక వృత్తి వ్యాపారాలపై శిక్షణనిచ్చి మహిళా సాధికారతకు కృషి చేసింది. అదేవిధంగా గ్రామంలో విద్య వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధి, ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలను కల్పించడంతోపాటు నిరుపేదల అభివృద్ధి కోసం అనునిత్యం తపించేవారు. అనారోగ్యతో వయోభారంతో నేడు ఆమె మృతి చెందింది. దీంతో  గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. షాద్నగర్ నియోజకవర్గం లోని పలువురు ప్రముఖులు ప్రజా సేవకురాలు బూరుగల సుమన ఇక లేరంటూ  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేశారు.

తాను మరణించినా తన శరీరం పదిమందికి ఉపయోగపడాలి
తాను మరణించిన తన శరీరం పదిమందికి ఉపయోగపడాలని బూర్గుల సుమన తన వీలునామాలు రాసుకుంది. బూర్గుల సువర్ణ వీలునామా ప్రకారం.. కుటుంబ సభ్యులు ఆమె శరీరాన్ని వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా ఆస్పత్రికి అప్పగించనున్నట్లు సమాచారం. హైదరాబాదులోని తన నివాసంలో బంధుమిత్రుల కడసారి చూపు కోసం నేటి మధ్యాహ్నం వరకు సందర్శన కొరకై ఉంచి తదనంతరం వైద్య కళాశాలకు శరీరాన్ని అప్పగించనున్నారు. చివరి శ్వాస వరకు ఆమె ప్రజా సేవకై పరితపించే బూరుగు లక్ష్మణ తన శరీరాన్ని ఆస్పత్రికి దానం చేయడం పట్ల ఆమె సామాజిక సేవా దృక్పధాన్ని పలువురు కొనియాడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -