నవతెలంగాణ – (డొంకేశ్వర్) ఆర్మూర్
నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిర్విరామ కృషి చేస్తున్నారని డొంకేశ్వర్ మండల బిజెపి ప్రధాన కార్యదర్శి తొండాకూర్ ముత్యం మంగళవారం తెలిపారు. పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ , నందిపేట మండలంలోని ఐలాపూర్ హాస్టల్, 30 పడకల ఆసుపత్రి, డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఇంటర్ కాలేజీ, తొండకూర్ నుండి గాదేపల్లి వరకు డబల్ రోడ్డు విస్తరణ సైతం చేసినారని అన్నారు. నియోజకవర్గానికి అమృత్ పథకం కింద కేంద్రం నుంచి నిధులు, అంకాపూర్ ,ముని పెళ్లి ,లక్ష్మాపూర్ రోడ్డుకు, డొంకేశ్వర్, నూతపల్లి రోడ్డుకు సైతం నిధులు తీసుకొచ్చినారని, ఈజీఎస్ ద్వారా డ్రైనేజీ ,సిసి రోడ్లకు సైతం నిధులు తెచ్చి అభివృద్ధిలో నిర్విరామ కృషి చేస్తున్నారని అన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సైతం అందజేస్తూ బడుగు, బలహీన ,పేద ప్రజల సంక్షేమానికై కృషి చేస్తున్నారని అన్నారు. అంకాపూర్ లో డబుల్ బెడ్రూంల ఇండ్లు సైతం పంపిణీ చేసినారని అన్నారు. గత పది సంవత్సరాల నుండి చూస్తే ప్రస్తుతం నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేలా చేస్తున్న ఘనత ఎమ్మెల్యే ధె అని అన్నారు.