Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తన భర్తను హత్య చేసిన నిందితుడికి

తన భర్తను హత్య చేసిన నిందితుడికి

- Advertisement -

రియాజ్ ఎంకౌంటర్ ఆనందంగా ఉంది 
పోలీస్ శాఖకు ధన్యవాదాలు 
కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

తన భర్తను హత్య చేసిన నిందితుడికి సరైన శిక్ష పడిందని కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత అన్నారు. రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్పై స్పందించిన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రియాజ్ ఎంకౌంటర్ పై కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎంకౌంటర్ ఆనందంగా ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీలో గల ప్రమోద్ నివాసం లో ఫ్యామిలీ మెంబెర్స్ మాట్లాడారు. ప్రమోద్ భార్య ప్రణీత భావోద్వెగానికి గురయ్యారు. పోలీసు శాఖ కు ధన్యవాదాలు తెలిపారు. హత్య జరిగిన రోజు సీసీఎస్ కార్యాలయం నుంచి అర్జెంట్గా రావాలని ఫోన్ కాల్ రావడంతో ఆయన డ్యూటీకి వెళ్లాడని తిరిగి మృతదేహంగా ఇంటికి వచ్చాడని ఆమె కన్నీటి పర్యంతమైంది.నిజామాబాద్ లోని రౌడీ షీటర్లందరినీ ఏరిపారేయాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ విషయమై ప్రణీత స్పందించింది. కానీ రూ. కోటి ప్రకటించారు కానీ నా భర్తను తిరిగి తీసుకురాలేరు కదా అని వ్యాఖ్యానించారు. మృతిచెందిన ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 300 గజాల ఇంటి స్థలం ఇవ్వడంపై ఆమె డీజీపీ శశిధర్ రెడ్డి, సీపీ సాయి చైతన్యలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేసి సరైన శిక్ష విధించారని అన్నారు. తన లాంటి పరిస్థితి మరో కుటుంబానికి రావద్దన్నారు.ఇక నైనా జిల్లా లో ఉన్న రౌడీ షీటర్ లపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -