Wednesday, April 30, 2025
Homeతెలంగాణ రౌండప్బీహార్ మాజీ  సీఎం బిపి మండల్ వర్ధంతి

బీహార్ మాజీ  సీఎం బిపి మండల్ వర్ధంతి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి సామాజిక మండల్ కమిషన్ చైర్మన్ బి పి మండల్ 43వ వర్ధంతి వేడుకలను ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో  బీసీ సంక్షేమ సంఘం, వివిధ సామాజిక వర్గాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల కొరకు, బీసీల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండల్ కమిషన్ కు చైర్మన్ గా బాధ్యత వహించారన్నారు  దేశం మొత్తం బీసీ సామాజిక వర్గంలో ఉప కులాల లెక్క దాదాపు 2600 ఉన్నట్ల 40 అంశాల నివేదికలో తెలపారన్నారు .ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారమే మాజీ ప్రధాని వీపీ సింగ్  బీసీలకు 27% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాలలో అమలు చేశారని పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గం ప్రధానమంత్రి పీఎం నరేంద్ర మోడీ చట్టసభలలో 50% రిజర్వేషన్లు అమలు కు కృషి చేయాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక వర్గ సీనియర్ నాయకులు,సామాజిక కార్యకర్త వడ్డేపల్లి మల్లేశం, బి ఎస్ పి హుస్నాబాద్  ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్ , బీసీ నాయకులు పిడిశెట్టి రాజు, వలస సుభాష్ చంద్రబోస్, గొర్ల ఐలేష్ యాదవ్, ఎగ్గోజు సుదర్శన్ చారి,  నన్నే శ్రీనివాస్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img