Tuesday, May 13, 2025
Homeజాతీయంప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌ఎఫ్‌ఐ జోక్యం అవశ్యం

ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌ఎఫ్‌ఐ జోక్యం అవశ్యం

- Advertisement -

– ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు ఎంఏ బేబీ
– ఆ సంఘం 18వ అఖిల భారత మహాసభ లోగో ఆవిష్కరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

విద్యార్థి సమాజంలో పట్టుకోసం మతతత్వవాదులు ప్రయత్నిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌ఎఫ్‌ఐ జోక్యం చాలా కీలకమని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు ఎంఏ బేబీ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ 18వ అఖిల భారత మహాసభ లోగోను ఆయన సోమవారం నాడిక్కడి హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఏ బేబీ మాట్లాడుతూ 1970లో తిరువనంతపురంలో మొదటి అఖిల భారత సమావేశం జరిగినప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ సభ్యత్వం 1.24 లక్షలనీ, నేడు దేశంలో అత్యంత బలమైన విద్యార్థి ఉద్యమంగా ఎస్‌ఎఫ్‌ఐ నిర్మించిందని అన్నారు. 18వ అఖిల భారత మహాసభ ఎస్‌ఎఫ్‌ఐ కృషిలో ఒక మైలురాయిగా నిలవాలన్నారు. ”విద్యార్థులను తప్పుడు దిశలో నడిపించడా నికి మతపరమైన కోణాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్న ప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ ప్రతిపాదించిన రాజకీయ తీర్మానం చాలా ముఖ్యమైనది” అని పేర్కొన్నారు. కోజికోడ్‌లో జూన్‌ 26 నుంచి 30 వరకు ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సమావేశం జరు గనుంది. మలప్పురంలోని వాలంచేరికి చెందిన లిబిన్‌ ఉన్నిక ష్ణన్‌ ఎస్‌ఎఫ్‌ఐ లోగోను రూపొందించారు. ఈ కార్యక్రమం లో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మాజీ నాయకులు నీలోత్పల్‌ బసు, అరుణ్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిశ్వాస్‌, సహాయ కార్యదర్శులు దీప్సితా ధార్‌, ఆదర్శ్‌ ఎం సాజి, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఐషీ ఘోష్‌, అధ్యక్షుడు సూరజ్‌ ఎలామోన్‌, ఎంఎల్‌ అభిజిత్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -