– ఆందోళనలో రైతులు
– సిద్దిపేట, దుబ్బాకలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
నవతెలంగాణ-సిద్ధిపేట, దుబ్బాక
భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. సోమవారం సిద్దిపేట పట్టణంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో పత్తి మార్కెట్‌లో ఉన్న మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దయింది. చాలా రోజుల కిందటే మార్కెట్‌కు మొక్కజొన్నలు, ధాన్యం తెచ్చినప్పటికీ.. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం మొత్తం తడిసిపోయిందని రైతులు వాపోయారు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తేమశాతం తక్కువగా ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు నామమాత్రంగా కొన్ని కుప్పలను మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారని, మిగతా కుప్పలకు చాలా తక్కువ ధరలను నిర్ణయిస్తున్నారని, దీంతో నష్టపోతున్నామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.దుబ్బాక మండల పరిధిలోని రాజక్కపేట ఐకేపీ సెంటర్లో పలువురు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారు. సోమవారం వేకువజామున కురిసిన వర్షంతో ధాన్యం తడిసి నీటి పాలైంది. ఎలాంటి షరతులూ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వర్షానికి తడిసిన ధాన్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES