Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో పార్టీలు నిబంధనలు పాటించాలి

జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో పార్టీలు నిబంధనలు పాటించాలి

- Advertisement -

– ప్రకటనలకు సంబంధించి ముందస్తు అనుమతి తీసుకోవాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నిలో పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలు విధిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సభల అనుమతి, ప్రచారం వ్యయాలను సమర్పించాలని సూచించారు. పోలింగ్‌ రోజు లేదా దానికి ముందురోజు పత్రికల్లో రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా సంస్థలు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసే తప్పుడు, మభ్యపెట్టే లేదా నిర్ధారణ లేని ప్రకటనలను ప్రచారం చేయరాదన్నారు. ప్రకటనలను ప్రచురించే ముందు కనీసం రెండు రోజుల ముందుగానే ఎంసీఎంసీకి దరఖాస్తు చేయాలనీ, తద్వారా సమీక్షకు తగిన సమయం లభిస్తుందని వివరించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఎంసీఎంసీ కమిటీలు ఇప్పటికే క్రియాశీలంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉందనీ, ప్రచారం, వ్యయం, ప్రకటనల విషయంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని సుధర్షన్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -